- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, డైనమిక్ బ్యూరో : ఇరాన్‌లో నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లోని జమ్మూ కాశ్మీర్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఇరాన్‌కు మద్దతుగా శుక్రవారం నాడు కాశ్మీరీ షియా ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తూ శ్రీనగర్, బుద్గాం ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. బుద్గాం జిల్లాలో నిరసనకారులు స్థానిక ఇమాంబారా నుండి మెయిన్ చౌక్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. శ్రీనగర్ వీధుల్లోనూ ముస్లింలు అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక ప్లకార్డులు పట్టుకోని నినాదాలు చేశారు. నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, నిరసనలు ప్రశాంతంగా సాగాయని పోలీసులు చెబుతున్నారు.
ప్రాణత్యాగానికైనా సిద్ధం..
‘ప్రాణత్యాగానికైనా సిద్ధం’ అంటూ ఈ సందర్భంగా ఓ నిరసనకారుడు మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రజలను శాంతియుతంగా బతకనివ్వడం లేదని, అందుకే ఆ శత్రువులకు వ్యతిరేకంగా మేము గళం విప్పుతున్నామని తెలిపారు. ప్రతి దేశానికి అభివృద్ధి చెందే హక్కు ఉందని. మేము ఇరాన్ అధినేత ఆయతుల్లా ఖమేనీకి, అక్కడి ప్రజలకు అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఇస్లాం రక్షణ కోసం, అణచివేతకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుందని, దీని కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమే అని ఓ నిరసనకారుడు పేర్కొన్నారు. కాగా, ఇరాన్‌లోని ప్రస్తుత పరిస్థితుల పట్ల కాశ్మీరీ షియా ముస్లింలలో తీవ్ర ఆగ్రహం ఉన్నట్లు ఈ నిరసనలు తెలియజేస్తున్నాయి.






