Air pollution: వాయు కాలుష్యంపై ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద భారీ నిరసన

by Ramesh Naini |

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి తీవ్రంగా పెరిగిపోవడంతో ఆదివారం నాడు ఇండియా గేట్ సమీపంలో పర్యావరణ కార్యకర్తలు, విద్యార్థులు భారీగా నిరసన చేపట్టారు.

Air pollution: వాయు కాలుష్యంపై ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద భారీ నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి తీవ్రంగా పెరిగిపోవడంతో ఆదివారం నాడు ఇండియా గేట్ సమీపంలో పర్యావరణ కార్యకర్తలు, విద్యార్థులు భారీగా నిరసన చేపట్టారు. నిరసన కారులు పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. స్వచ్ఛమైన గాలిని అందించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని నిరసనకారులు మండిపడ్డారు. కాలుష్యంపై ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే బైఠాయించిన ఆందోళన కారులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆదివారం ఉదయం 7 గంటలకు సగటు గాలి నాణ్యత సూచిక (AIQ) 381 వద్ద ఉండటంతో దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు ఏర్పడింది. ఇక ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచిక 429 గా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) డేటా విడుదల చేసింది. ఇక్కడ గాలి నాణ్యత మరింత దిగజారిందని హెచ్చరించింది. మరోవైపు చాంధినీ చౌక్ 390, ఆర్‌కే పురం 397, ఐటీఓ 384, పంజాబీ బాగ్ 411, పట్‌పర్‌గంజ్ 401, పూసా 360, ద్వారక సెక్టార్ 286గా నమోదైంది.

Next Story