ఢిల్లీలో భారీ ఆపరేషన్.. 285 మంది అరెస్ట్

by Muthe.Rajitha |   (  Updated:2025-12-27 03:40:05  IST  )

ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు దాడి నేపథ్యంలో రానున్న నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్లు చేపట్టారు.

ఢిల్లీలో భారీ ఆపరేషన్.. 285 మంది అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు దాడి నేపథ్యంలో రానున్న నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్లు చేపట్టారు. "ఆపరేషన్ క్లీన్ స్వీప్" పేరుతో నిర్వహించిన ఈ రైడ్స్ ల్లో భారీగా డ్రగ్స్‌, అక్రమ ఆయుధాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నార్కో ఆఫెండర్లు, బూట్‌లెగర్లు, పాత క్రిమినల్స్ సహా 285 మందిని అరెస్టు చేశారు. ముఖ్యంగా డ్వార్కా డిస్ట్రిక్ట్‌లో నిర్వహించిన ఆపరేషన్‌లో 9 మందిని అరెస్ట్ చేసి, 33 కిలోలకుపైగా డ్రగ్స్‌, 40 అక్రమ ఆయుధాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇటీవలి నగరవ్యాప్తంగా జరిగిన రైడ్స్‌లో హెరాయిన్‌, గంజా, కొకైన్‌ వంటి మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలు భారీగా పట్టుబడ్డాయి. నూతన సంవత్సర వేడుకల సమయంలో డ్రగ్స్ వినియోగం, అక్రమ కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేశారు. ఢిల్లీలో న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

Next Story