శ్రీకృష్ణ నామస్మరణతో మార్మోగిన కోల్‌కతా నగరం.. వీడియో వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-12-07 12:42:16  IST  )

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో శ్రీకృష్ణ నామస్మరణతో మార్మోగింది.

శ్రీకృష్ణ నామస్మరణతో మార్మోగిన కోల్‌కతా నగరం.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో శ్రీకృష్ణ నామస్మరణతో మార్మోగింది. ఆదివారం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ గీతా పారాయణ కార్యక్రమం జరిగింది. సనాతన సంస్కృతి సంసద్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్షల మంది భక్తులు సామూహిక గీతా పారాయణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ సీవీ ఆనంద బోస్‌, కేంద్రమంతి సుకాంత మజుందార్‌, యోగా గురువు బాబా రాందేవ్ లాంటి ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. ఇక, బెంగాల్‌తో పాటు పరిసర రాష్ట్రాల ప్రజలు, వివిధ మఠాలకు చెందిన సాధువులు తదితరులు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలివచ్చారు. దేశంలోనే ఇది అతిపెద్ద సామూహిక గీతా పారాయణమని భావిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. లక్షలాది మంది ఏకమై గీత పారాయణం చేయడంతో కోల్‌కతా నగరం ప్రతిధ్వనించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఎక్స్ వేదికగా బీజేపీ సీనియర్ నేత అమిత్‌ మాలవీయ వీడియో సోస్ట్ చేశారు. కోల్‌కతా ఈ రోజు నిజంగా చారిత్రాత్మక దృశ్యాన్ని చూసిందని ఆయన పేర్కొన్నారు. 6.5 లక్షలకు పైగా భక్తులు భారీ గీతా పారాయణానికి గాత్రదానం చేశారని తెలిపారు. బెంగాల్‌లో రాజకీయ ప్రదర్శనలకు తరచుగా వేదికగా ఉండే ఐకానిక్ బ్రిగేడ్ గ్రౌండ్, మరింత లోతైనదిగా మారిపోయిందన్నారు. హిందూ సమూహాలు అసాధారణ సంఖ్యలో కలిసి వచ్చాయి, ఈ అపూర్వమైన గీతా పారాయణం.. కోసం బెంగాలీ హిందువులను ఏకతాటిపైకి తెచ్చిందని తెలిపారు. వీడియో ఇదే..

Next Story