China Fire Accident : చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

by Muthe.Rajitha |   (  Updated:2025-04-30 11:23:43  IST  )

చైనా(China)లో లోని లియోనింగ్ ప్రావిన్సులోని లియోయాంగ్ నగరంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది.

China Fire Accident : చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : చైనా(China)లో లోని లియోనింగ్ ప్రావిన్సులోని లియోయాంగ్ నగరంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. లియోయాంగ్(Leoyang) నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం(Restaurant Fire Accident) జరిగింది. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముందుగా కిచెన్ లో మంటలు చెలరేగగా.. రెస్టారెంట్ చెక్కతో నిర్మించినది కావడం వలన అవి ఒక్కసారిగా రెస్టారెంట్ అంతా వేగంగా వ్యాపించాయి. మధ్యాహ్న సమయం కావడంతో రెస్టారెంట్ లో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉందని, మృతుల సంఖ్య భారీగా పెరగడానికి అది కూడా ఒక కారణమేనని స్థానిక అధికారులు పేర్కొన్నారు.

అయితే ఎగ్జిట్ ద్వారం ఇరుకుగా ఉండటంతో అందరూ ఒకేసారి బయటికి వెళ్లలేక మంటల్లో చిక్కుకున్నారని తెలియ జేశారు. ఈ ఘోర అగ్నిప్రమాదంపైచైనా అధ్యక్షుడు జిన్ పింగ్(Jin Ping) స్పందించారు. ఈ ఘటనలో మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈనెలలో చైనాలో జరిగిన 2వ అతిపెద్ద అగ్నిప్రమాదం ఇది. గత 9వ తేదీనా ఓ నర్సింగ్ హోంలో అగ్నిప్రమాదం జరిగి 20 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు.

Next Story