Breaking: ఢిల్లీలో ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం

by Prasad Jukanti |

పార్లమెంట్ కు కూత వేటు దూరంలో ఉన్న ఎంపీల రెసిడెన్షిషల్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Breaking: ఢిల్లీలో ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలోని ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పార్లమెంట్‍కు కూతవేటు దూరంలో ఉన్న రాజ్యసభ సభ్యుల నివాస రెసిడెన్షియల్ కాంప్లెక్స్ (MP residence) బ్రహ్మపుత్ర అపార్ట్ మెంట్‍లో (Brahmaputra Apartments) ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అపార్ట్ మెంట్‍లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఘటన స్థలం వద్దకు చేరుకున్న ఆరు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం బ్రహ్మపుత్ర అపార్ట్ మెంట్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సున్నితమైన ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభంవించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story