ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. 13వ అంతస్తులో చిక్కుకున్న 25 మంది

by Muthe.Rajitha |

ముంబైలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. 13వ అంతస్తులో చిక్కుకున్న 25 మంది
X

దిశ, వెబ్ డెస్క్ : ముంబైలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని వెస్ట్ జోగేశ్వరి ప్రాంతంలోని JMS బిజినెస్ సెంటర్‌లో గురువారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. ఈ 13 అంతస్తుల భవనంలో 9వ నుంచి 12వ అంతస్తుల వరకు మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసారు. 12 అగ్నిమాపక వాహనాలు దాదాపు 5 గంటలపాటు కష్టపడి మంటలను ఆర్పివేశాయి. అయితే ప్రమాద సమయంలో భవనంలోని పై అంతస్థులో 25 మంది చిక్కుకోగా.. వారిని ప్రత్యేక ల్యాడర్స్ సహాయంతో సురక్షితంగా కిందికి తీసుకువచ్చారు.

కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉండటంతో మంటలు త్వరగా భవనం మొత్తం వ్యాపించినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంలో భారీగా ఆస్థి నష్టం సంభవించగా.. ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాలని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

Next Story