- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం.. 345 వాహనాలు దగ్ధం
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున వాహానాలు దగ్దం అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (Police Training Center) సంభవించిన భారీ అగ్ని ప్రమాదం (Massive Fire Accident)లో పెద్ద ఎత్తున వాహానాలు దగ్దం (Burnt) అయ్యాయి. ఈ ఘటన ఢిల్లీ (Delhi)లోని ఖజూరి (Khajuri)లో ఉన్న వజీరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (Wazirabad Policxe Training Center) లో చోటు చేసుకుంది. ఆదివారం వాహానాలు పార్క్ చేసి ఉన్న స్టోర్‌హౌస్ (store House)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో పొగ పూర్తిగా వ్యాపించింది. ఇది గమణించిన ట్రైనింగ్ సెంటర్ లోని అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది (Fire Staff) ఏడు యంత్రాలతో మంటలు ఆర్పేందుకు శ్రమించారు. మంటలు పూర్తిగా ఆర్పేందుకు దాదాపు 2 గంటల సమయం పట్టిందని డీఎఫ్ఎస్ అధికారి (DFS Officer) తెలిపారు. ఈ ప్రమాదంలో స్టోర్ హౌజ్ లో పార్క్ చేసిన దాదాపు 345 వాహనాలు కాలి బూడిదయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని, ప్రస్తుతం ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.






