- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రసగుల్లా కోసం రచ్చ రచ్చ.. ఆగిపోయిన పెళ్లి
పెళ్లి భోజనంలో రసగుల్లా వడ్డించలేదని వధువు, వరుడు తరపు బంధువులు పరస్పరం ఘర్షణకు దిగి

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి భోజనంలో రసగుల్లా వడ్డించలేదని వధువు, వరుడు తరపు బంధువులు పరస్పరం ఘర్షణకు దిగి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. చివరికి పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన బిహార్ లోని బోధ్ గయాలో జరిగింది. దీంతో వధువు కుటుంబం వరుడి కుటుంబంపై వరకట్న కేసు నమోదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 29న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బుద్ధ గయాలోని ఒక హోటల్ లో వధుడి కుటుంబం బస చేసింది. వరుడి కుటుంబం, సమీప బంధుమిత్రులు అక్కడికి సమీపంలోని గ్రామం నుంచి వచ్చారు. వివాహ ఆచారాలు ముగిసిన అనంతరం భోజనాలు ప్రారంభించారు.
ఈ క్రమంలో రసగుల్లా వడ్డించలేదంటూ వధువు తరపు బంధువులు గొడవ చేశారు. కుర్చీలు, ప్లేట్లతో కొట్టుకున్నారు. ఇరువైపులా అనేక మంది గాయపడ్డారు. రసగుల్లా లేకపోవడం వల్లే గొడవ జరిగిందని, దీనిని అడ్డం పెట్టుకుని తమపై తప్పుడు వరకట్న కేసు పెట్టారని వరుడి తండ్రి మహేంద్ర ఆరోపించారు. కాసేపటికి పెళ్లికి తాము ఒప్పుకున్నా.. వధువు, ఆమె కుటుంబం ఒప్పుకోలేదన్నారు. తాము పెట్టిన బంగారాన్ని తీసుకుని వధువు వెళ్లిపోయిందని వరుడి తల్లి మున్నీదేవి ఆరోపించింది.






