మైసూరులో భారీ పేలుడు.. ఒకరు మృతి

by Gantepaka Srikanth |

మైసూరులో భారీ పేలుడు.. ఒకరు మృతి

మైసూరులో భారీ పేలుడు.. ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక(Karnataka)లోని మైసూరు నగరంలో భారీ పేలుడు సంభవించింది. గురువారం రాత్రి మైసూరు(Mysore)లోని అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలై ఒకరు అక్కడికిక్కడే మృతిచెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసి.. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. గ్యాస్ సిలిండర్ వల్లే పేలుడు సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కొన్ని నెలల క్రితమే దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించి 9 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో 20 మంది గాయాలపాలయ్యారు.

Next Story