- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివకాశి బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
by Muthe.Rajitha |
తమిళనాడులోని శివకాశి(Shivakashi)లో ఓ బాణసంచా(Crackers) తయారీ కేంద్రంలో నేడు భారీ పేలుడు సంభవించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులోని శివకాశి(Shivakashi)లో ఓ బాణసంచా(Crackers) తయారీ కేంద్రంలో నేడు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన శివకాశి సమీపంలోని కీలతాయిల్‌పట్టి గ్రామంలోని ఒక ఫైర్‌వర్క్స్ యూనిట్‌లో సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు కార్మికులు మృతి చెందగా.. గాయపడిన వారిని విరుదునగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పేలుడు సంభవించిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రెస్క్యూ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






