- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవ్గామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. వైరల్‌గా మారిని సీసీటీవీలో పుటేజ్
ఢిల్లీలో ఉగ్రవాద ఆత్మాహుతి దాడి మరవక ముందు జమ్మూ కశ్మీర్‌లోని నవ్గామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు సంబవించడం సంచలనంగా మరింది.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఉగ్రవాద ఆత్మాహుతి దాడి మరవక ముందు జమ్మూ కశ్మీర్‌లోని నవ్గామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు సంబవించడం సంచలనంగా మరింది. అయితే ఈ పేలుడు పై కేంద్ర హోంశాఖ స్పందించి.. J&K విభాగం జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ లోఖండే (Prashant Lokhande) అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం.. నౌగామ్ పోలీసులు ఒక టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించగా, ఆ కేసులో FIR 162/2025 దర్యాప్తు సమయంలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, రసాయనాలు స్వాధీనం అయ్యాయి. నియమావళి ప్రకారం.. ఈ పదార్థాలను ఓపెన్ ఏరియాలో భద్రంగా ఉంచి, గత రెండు రోజులుగా సాంకేతిక విధానాల ప్రకారం ఫోరెన్సిక్ పరీక్షల కోసం సిద్ధం చేస్తున్నారు. ఇవి అస్థిరమైనవిగా, అత్యంత సున్నితమైనవిగా ఉండటంతో నిపుణుల పర్యవేక్షణలో జాగ్రత్తగా నిర్వహణ జరుగుతున్న సమయంలోనే ప్రమాదవశాత్తు భారీ పేలుడు జరిగిందని వారు ప్రకటించారు.
ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మరణించగా, 27 మంది పోలీసు సిబ్బంది గాయపడినట్లు ప్రకటించారు. రాత్రి సమయంలో భారీ శబ్దంతో సంభవించిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోలో పేలుడు తీవ్రత, దాని విస్తృతి ఎంత భారీగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. పేలుడు శబ్దం 15 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిదని స్థానికులు చెబుతున్నారు. ఈ తీవ్రతను స్పష్టం చేస్తూ.. వైరల్ గా మారిన వీడియోలోని విజువల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా ఈ విషాద ఘటనపై కేంద్ర హోంశాఖ, స్థానిక పోలీసు అధికారులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించగా, ఈ ఘటన పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందని భావిస్తూ.. అసలు కారణాన్ని గుర్తించేందుకు ప్రత్యేక విచారణ బృందం పని చేస్తుంది.






