- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FLASH: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో సంచలనం ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఎర్రకోట వద్ద కారులో భారీ పేలుడు సంభవించింది. గేట్ నెంబర్ -1 వద్ద పార్కింగ్ చేసిన కారు బ్లాస్ట్ అయింది. ఆ మంటలు అక్కడే ఉన్న మరికొన్ని కార్లకు అంటుకున్నాయి. దీంతో మొత్తం ఐదు కార్లు కాలిబూడిదయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ పేలుడు ఘటన ఢిల్లీ ప్రజలను భయాందోళనకు చేసింది. విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పేలుడుకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవలే దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను భద్రతా సంస్థలు భగ్నం చేశాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక వైద్యుడి ఇంట్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరికాయి. 300 కేజీల RDX, ఏకే 47, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ లేదా ఉత్తర భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పెద్ద ప్లాన్ చేశారని స్పష్టం చేస్తోంది.
Read More : భారీ పేలుడుతో తొమ్మిది మంది మృతి....ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా హైఅలర్ట్






