- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ పేలుడుతో తొమ్మిది మంది మృతి.. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా హైఅలర్ట్
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఎర్రకోట మెట్రోస్టేషన్ పార్కింగ్ వద్ద కారులో పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కల వాహనాలకూ మంటలు అంటుకున్నాయి. దీంతో మొత్తం ఎనిమిది కార్లు కాలి బూడిదయ్యాయి. పలు దుకాణాలు ధ్వంసం అయ్యాయి. సరిగ్గా సోమవారం సాయంత్రం 6.45 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం వల్ల పలువురికి తీవ్ర గాయాలు కాగా, తొమ్మిది మంది మృతిచెందారు. విషయం తెలిసిన వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. మరోవైపు.. ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. కాగా, ఇటీవలే దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను భద్రతా సంస్థలు భగ్నం చేసిన విషయం తెలిసిందే. గుజరాత్, హైదరాబాద్‌లో ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ లేదా ఉత్తర భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పెద్ద ప్లాన్ చేశారని స్పష్టం చేస్తోంది. అలర్ట్






