- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
‘ఆపరేష్ కగార్’ (Operation Kagar)లో భాగంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఎదురుకాల్పుల పర్వం కొనసాగుతూనే ఉంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar)లో భాగంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఎదురుకాల్పుల పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ (Kankare) జిల్లా చోటెబెథియా (Chotebethia) అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్ (CRPF) దళాలు, కాంకేర్ జిల్లా పోలీసులు జాయింట్ కూబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరు వర్గాల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో రెండు రైఫిళ్లతో పాటు విప్లవ సాహిత్యం, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా భద్రతా దళాలు వెల్లడించాయి.
Next Story






