జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

by Gantepaka Srikanth |

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లోని కిస్త్వా్ర్‌లో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది.

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లోని కిస్త్వా్ర్‌లో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం భారత సైన్యం - జమ్మూ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కాగా, ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి కారకులుగా భావిస్తోన్న ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదుల ఫొటోలతో కూడిన పోస్టర్లను జమ్మూకశ్మీర్‌లో భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు. వాటిపైన టెర్రర్ ఫ్రీ కశ్మీర్‌ అని సందేశం దర్శనమిచ్చింది. ఆ ఉగ్రమూకల గురించి ఎవరైనా విశ్వసనీయ సమాచారం ఇస్తే.. రూ.20 లక్షల రివార్డు ఇస్తామని వాటిల్లో పేర్కొన్నారు. ఈ సమాచారం గురించి చెప్పిన వారి వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకురాదని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే స్థానికుల నుంచి సమాచారం వచ్చిన ప్రతీసారి వెంటనే అప్రమత్తమై.. కాల్పులకు దిగుతున్నారు.

Next Story