ఢిల్లీ కారు పేలుడు..అమ్మోనియం నైట్రేట్ వాడిన‌ట్లు అనుమానం !

by velandi.Saikiran |

ఢిల్లీ పేలుడులో ఆమ్మోనియం నైట్రేట్ ( Ammonium nitrate) వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఢిల్లీ కారు పేలుడు..అమ్మోనియం నైట్రేట్ వాడిన‌ట్లు అనుమానం !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోన‌నే టెన్షన్ లో దేశ ప్రజలు ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే ఇలాంటి బ్లాస్టింగ్ జరగడం అందరినీ వణికిస్తోంది. సోమ‌వారం రోజు సాయంత్రం సమయంలో కారు బ్లాస్టింగ్ కావడం కారణంగా దాదాపు 13 మంది సామాన్య ప్రజలు మరణించారు. మరో ఆరు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ల‌ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందట. అయితే ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ పేలుడు అంశం గురించి సంచలన విషయం బయటకు వచ్చింది.

ఢిల్లీ పేలుడులో ఆమ్మోనియం నైట్రేట్ ( Ammonium nitrate) వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వాస్తవంగా అమ్మోనియం నైట్రేట్ ను ఎరువుల్లో వాడుతారు. మండే స్వభావం ఎక్కువగా ఉండటం కారణంగా పేలుడు పదార్థాల్లో కూడా వాడుతారు. ఈ పేలుడు శక్తివంతమైనదని, చుట్టుపక్కల వస్తువులను క్షణాల్లోనే నాశనం చేయగలద‌ని చెబుతున్నారు. జనావాసల్లో దీనిని పెద్ద ఎత్తున నిల్వ చేయడం నిషేధం. తాజాగా హర్యానాలో వీటిని విలువలను కూడా భారీగా గుర్తించారు. అయితే తాజాగా జరిగిన ఢిల్లీ పేలుడు సంఘటనలో అమ్మోనియం నైట్రేట్ విపరీతంగా వాడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

Next Story