- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DGCAలో భారీ అవినీతి తిమింగలం: లంచం తీసుకుంటూ దొరికిన డిప్యూటీ డైరెక్టర్ జనరల్
డీజీసీఏలో లంచం బాగోతం బయటపడింది. ఈ మేరకు సంస్థలో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA)లో భారీ అవినీతి బట్టబయలైంది. లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలతో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (DDG) స్థాయి అధికారిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్ట్ చేసింది. అయితే, డీజీసీఏలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న ముదావత్ దేవులా ఓ ప్రైవేట్ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్ట్ అనంతరం సదరు అధికారికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో సుమారు రూ.37 లక్షల నగదు, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, వెండి నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం అధికారి మాత్రమే కాకుండా, ఈ లంచం వ్యవహారంలో మీడియేటర్లుగా వ్యవహరించిన మరో ఇద్దరిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. విమానయాన సంస్థలకు సంబంధించిన అనుమతులు, లైసెన్సుల మంజూరులో సదరు అధికారి అవినీతికి పాల్పడినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది.






