12 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. చూస్తే వణికిపోవడం ఖాయం!

by Gantepaka Srikanth |

భారీ కింగ్ కోబ్రా ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

12 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. చూస్తే వణికిపోవడం ఖాయం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని గంజాం జిల్లాలోని చికిటి ఎన్ఏసీ (Chikiti NAC) పరిధిలోని చికిటి పెంట్ ప్రాంతంలో, ఒక భారీ కింగ్ కోబ్రా ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సుమారు 12 అడుగుల పొడవున్న ఈ విషసర్పం, రద్దీగా ఉండే యూనియన్ బ్యాంక్ సమీపంలో కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పామును చూసిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు 'స్నేక్ హెల్ప్‌లైన్' (Snake Helpline) కు సమాచారం అందించారు. దీంతో హెల్ప్‌లైన్ ప్రతినిధులు రామచంద్ర సాహు, గౌరీ సాహు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి, వారి సమక్షంలో అత్యంత జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.

అడవిలోకి సురక్షితంగా విడుదల..

ఎంతో అనుభవం ఉన్న ఈ రెస్క్యూ టీమ్, సుమారు గంటపాటు శ్రమించి ఆ భారీ కింగ్ కోబ్రాను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని ఒక సంచిలో ఉంచి, సమీపంలోని కేరండిమల్ (Kerandimal) అటవీ ప్రాంతానికి తరలించి, దాని సహజ సిద్ధమైన ఆవాసంలోకి విడిచిపెట్టారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇంత పెద్ద పాము దొరకడం స్థానికంగా సంచలనం రేపింది. ఎవరికీ ఎలాంటి హాని కలగకుండా పామును పట్టుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సమయానికి స్పందించి సాహసోపేతంగా వ్యవహరించిన స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యులను, అటవీ శాఖ అధికారులను స్థానికులు అభినందించారు.




Next Story