South Carolina: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 11 మందికి గాయాలు

by Shamantha N |

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం జరిగింది. సౌత్ కరోలినాలోని లిటిల్ రివర్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి తెగబడ్డారు.

South Carolina: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 11 మందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం జరిగింది. సౌత్ కరోలినాలోని లిటిల్ రివర్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి తెగబడ్డారు. దీంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. అయితే, ఈ దాడిలో 11 మంది గాయపడినట్లు.. వారిని ఆస్పతికి తరలించినట్లు హారీ కౌంటీ పోలుసుల తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలిలో అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి. నివాస సముదాయాల మధ్య ఎవరు కాల్పులు జరిపారనే విషయాలు తెలియాల్సి ఉందని.. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, సౌత్ కరోలినాలో కాల్పులు సర్వసాధారమైపోయాయి. గతనెలలో టూరిజం స్పాట్ అయిన మిర్టిల్ బీచ్ లో దుండగులు కాల్పులకు పాల్పడ్డాడు. ఆ దాడిలో ఒకరు చనిపోగా.. 11 మందికి గాయాలయ్యాయి. అంతేకాకుండా, నార్త్ ఓషన్ బౌలేవార్డ్‌లో ఓ వ్యక్తి ప్రజలపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఆ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అయితే, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అతడు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Next Story