Martyr: పహెల్గాం అమరవీరుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం.. నియామకపత్రం అందజేసిన ఎల్జీ

by B.Srinivas |

జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు టూరిస్టులపై దాడి చేసిన విషయం తెలిసిందే.

Martyr: పహెల్గాం అమరవీరుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం.. నియామకపత్రం అందజేసిన ఎల్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు టూరిస్టులపై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఘటన టైంలో ఉగ్రవాదులను అడ్డుకోబోయి ప్రాణాలు కోల్పోయిన స్థానిక పోలీ రైడ్ ఆపరేటర్ ఆదిల్ షా (Adil shah) భార్యకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) ఆదిల్ షా భార్య గుల్నాజ్ అక్తర్‌కు శనివారం నియామకపత్రం అందజేశారు. అనంతనాగ్ లోని మత్య్స శాఖలో ఆమెకు ఉద్యోగం ఇచ్చినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆ కుటుంబానికి మరింత అండగా ఉంటామని చెప్పారు. పోనీ రైడ్ ఆపరేటర్ చూపిన ధైర్యసాహసాలకు గాను ఆర్థిక సాయం అందజేసినట్టు తెలిపారు. పహెల్గాంలో పర్యాటకులను కాపాడుతూ తన ప్రాణాలను త్యాగం చేసిన ఆదిల్ ధైర్యసాహసాలను చూసి దేశం మొత్తం గర్విస్తోందని కొనియాడారు. కాగా, పహెల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా అనంతరం భారత్ పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story