Madhya Pradesh: కాళ్లు చేతులు కట్టేసి.. 8 నెలలుగా ఫ్రిజ్ లోనే ఉంచి.. యువతి హత్య

by Shamantha N |

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో మహిళను చంపి.. ఎనిమిది నెలలుగా ఫ్రిజ్ లోని ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చింది. బృందావన్ ధామ్‌లోని ఒక ఇంట్లోని ఫ్రిజ్‌లో ఒక మహిళ మృతదేహం బయటపడింది.

Madhya Pradesh: కాళ్లు చేతులు కట్టేసి.. 8 నెలలుగా ఫ్రిజ్ లోనే ఉంచి.. యువతి హత్య
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో మహిళను చంపి.. ఎనిమిది నెలలుగా ఫ్రిజ్ లోని ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చింది. బృందావన్ ధామ్‌లోని ఒక ఇంట్లోని ఫ్రిజ్‌లో ఒక మహిళ మృతదేహం బయటపడింది. బృందావన్ ధామ్ లో మూసివున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తాళాలు బద్దలుకొట్టి అధికారులు తలుపు తెరిచారు. లోపలున్న ఫ్రిజ్‌లో పోలీసులకు ఒక మహిళ మృతదేహం కనిపించింది. డెడ్ బాడీ చేతులు, కాళ్లు కట్టివేసివున్నాయి. ఈ ఘటన వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. అయితే, మహిళ డెడ్ బాడీ దొరికి ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవస్తవను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే, ధీరేంద్ర ఆ ఇంటిని 2023 జులైలో సంజయ్ పాటిదార్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారని దర్యాప్తులో తేలింది. కాగా.. సంజయ్ 2020 జూన్ లో ఇల్లు ఖాళీ చేశాడు. కానీ, ఓ గదిలో ఫ్రిజ్ సహా కొన్ని వస్తువులను వదిలేశారని అధికారులు పేర్కొన్నారు. దీంతో, పోలీసులు సంజయ్ ను అరెస్టు చేశారు.

హత్య ఎందుకు చేశాడంటే?

కాగా సంజయ్ పాటిదార్ గత ఐదు సంవత్సరాలుగా ప్రతిభా అలియాస్ పింకీ ప్రజాపతితో సహజీవనం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రతిభ పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో సంజయ్ ఆమెను హతమార్చాడని పేర్కొన్నారు. సంజయ్ తన స్నేహితుడు వినోద్ దేవ్‌తో కలిసి 2024 మార్చిలో ఆమెను గొంతు కోసి చంపాడన్నారు. తర్వాత ఆ మృతదేహానికి చేతులు, కాళ్లు కట్టేసి ఫ్రిజ్‌(Fridge)లో దాచిపెట్టాడని వెల్లడించారు. ఈ కేసులో సంజయ్ పాటిదార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని స్నేహితుడు వినోద్ ఇప్పటికే రాజస్థాన్‌లోని ఒక జైలులో ఉన్నాడు. సంజయ్ వివాహితుడని, వ్యవసాయ పనులు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు.

Next Story