ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న వరుడు.. మూడో రోజు ఇంట్లో నగలు, డబ్బుతో పరారైన వధువు..

by Sujitha Rachapalli |

రోజురోజుకు నిజాయితీ, విలువలు పడిపోతున్నాయి. నమ్మిన వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలో జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణ. కాగా ఈ వింత సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న వరుడు.. మూడో రోజు ఇంట్లో నగలు, డబ్బుతో పరారైన వధువు..
X

దిశ, వెబ్ డెస్క్ : రోజురోజుకు నిజాయితీ, విలువలు పడిపోతున్నాయి. నమ్మిన వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలో జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణ. కాగా ఈ వింత సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓ యువకుడు పెళ్లి కోసం రూ. 90వేలు చెల్లించాడు. రెండు రోజులు బాగానే ఉన్న అమ్మాయి.. మూడో రోజున కనిపించకుండా పోయింది. ఇంట్లోని ఆభరణాలు, నగదుతో పాటు పరారైంది. కుటుంబ సభ్యులు వధువు కోసం వెతకడానికి ప్రయత్నించగా.. గ్రామం వెలుపల ఒక పొలంలో ఆమె బట్టలు కనిపించాయి. చెరకు తోటల్లో ఆమెను వెతకడానికి డ్రోన్ కెమెరాను ఉపయోగించినా.. లాభం లేకుండా పోయింది. అప్పటికే గ్రామం నుంచి పరారైంది. బాధితుడైన వరుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. CCTV ఫుటేజ్‌లో ఆమె ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళుతున్నట్లు కనిపించింది. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

Next Story