- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mark carney: భారత్‌తో సత్సంబంధాలు పునరుద్ధరిస్తాం.. మార్క్ కార్నీ
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తదుపరి ప్రధాన మంత్రిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin truado) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తదుపరి ప్రధాన మంత్రిగా మార్క్ కార్నీ (Mark carney) ఎన్నికయ్యారు. అధికార లిబరల్ పార్టీ (Libaral party) నేతగా విజయం సాధించిన కార్నీ త్వరలోనే పీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. తాజాగా నిర్వహించిన ఓటింగ్‌లో కార్నీకి 85.9శాతం ఓట్లు రాగా.. ఫ్రీలాండ్‌కు కేవలం ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కార్నీ లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైనట్టు పార్టీ ప్రకటించింది. అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, రాబోయే పార్లమెంటు ఎన్నికల వేళ పాలక లిబరల్ పార్టీ కార్నీని తన నాయకుడిగా ఎన్నుకుంది.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సత్సంబంధాలను పునరుద్ధరిస్తానని చెప్పారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తానని తెలిపారు. కెనడా సారూప్యత కలిగిన దేశాలతో వాణిజ్య సంబంధాలను విస్తృతం చేసుకోవలని కోరుకుంటుందని తెలిపారు. భారత్ తో స్నేహ పూర్వక సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. అయితే రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైన ఖలిస్థానీ మద్దతుదారుల అంశంపై మార్క్ కార్నీ ఎటువంటి ప్రకటనా చేయలేదు.






