- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mark-1A: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు బూస్ట్.. 97 తేజస్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు డీల్ !
భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 97 మార్క్-1ఏ తేజస్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌పై రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం సంతకం చేసింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ ఆగస్టులో విమానాల కొనుగోలుకు ఆమోదం తెలపగా తాజాగా డీల్‌పై అధికారిక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 62,370 కోట్లు ఖర్చు చేయనుండగా 97 మార్క్-1ఏ విమానాలను హెచ్ఏఎల్ తయారు చేయనుంది. ఇందులో 68 సింగిల్ సీటర్ ఫైటర్ జెట్స్, 69 ట్విన్ సీటర్ ట్రెయినింగ్ విమానాలు, సంబంధిత పరికరాలు, ఇతర సిస్టమ్స్ ఉన్నాయి. ఈ విమానాల డెలివరీ 2027-28లో ప్రారంభమై ఆరు సంవత్సరాలలో పూర్తవుతుందని కేంద్రం తెలిపింది.
64 శాతం స్వదేశీ కంటెంట్
తేజస్ ఎంకే-1ఏ విమానం 64 శాతం కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్ కలిగి ఉంటుంది. గత ఒప్పందం కంటే అదనంగా 67 పరికరాలను ఇందులో జోడించారు. అలాగే యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే రాడార్ (ఏఈఎస్ఏ), స్వయం రక్ష కవచ్, కంట్రోల్ సర్ఫేస్ యాక్యుయేటర్‌ల వంటి అధునాతన స్వదేశీ అభివృద్ధి చేసిన వ్యవస్థలు ఉన్నాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్ చొరవలను మరింత బలోపేతం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, 2021ఫిబ్రవరిలో రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్ఏఎల్‌తో రూ. 48,000 కోట్ల డీల్‌పై సంతకం చేసింది. ఆ డీల్ ప్రకారం భారత వైమానిక దళం 83 తేజస్ విమానాలను అందుకోవాల్సి ఉంది.
మిగ్-21స్థానంలో భర్తీ !
మార్క్-1ఎ విమానం వైమానిక దళంలో మిగ్-21 విమానాల స్థానాన్ని భర్తీ చేయనుంది. ఎయిర్ ఫోర్సులో ప్రస్తుతం 31 స్క్వాడ్రన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే అధీకృత బలం 42 స్క్వాడ్రన్లుగా ఉంది. అటువంటి పరిస్థితిలో తేజస్ ఎయిర్ ఫోర్సులో గేమ్ ఛేంజర్‌గా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. తేజస్ వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచడమే గాక రక్షణ ఉత్పత్తిలో స్వావలంబన భారత్ లక్ష్యాన్ని కూడా వేగవంతం చేస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా, మిగ్-21 శుక్రవారం భారత వైమాణిక దళం నుంచి వైదొలగనున్న విషయం తెలిసిందే.






