డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి అంకితం: మరియా కొరీనా షాకింగ్ స్టేట్‌మెంట్

by Gantepaka Srikanth |

ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) రావడంపై మరియా కొరీనా(Maria Corina) స్పందించారు.

డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి అంకితం: మరియా కొరీనా షాకింగ్ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) రావడంపై మరియా కొరీనా(Maria Corina) స్పందించారు. ‘నా నోబెల్ బహుమతి వెనెజులా ప్రజలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు(Donald Trump) అంకితం ఇస్తున్నాను. ముఖ్యంగా వెనెజులా ప్రజలకు మద్దతిచ్చిన ట్రంప్‌నకు అంకితం చేస్తున్నాను. ఎట్టకేలకు వెనెజులా ప్రజల పోరాటానికి తగిన గుర్తింపు దక్కింది. మా పోరాటానికి మద్దతు తెలిపిన ప్రజాస్వామ్య దేశాలు అన్నింటికీ కృతజ్ఞతలు’ అని అవార్డు గ్రహీత మరియా కొరీనా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఇది అస్సలు నమ్మలేకపోతున్నానని చెప్పారు. ఇంతటితో మేము ఆగిపో.. మేము సాధించాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పారు. దాని కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తామని అన్నారు. ఒకరోజు మేము తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇది నా ఒక్కరి గెలుపు కాదు. వ్యక్తిగతంగా నేను దీనికి అర్హురాలిని కాదు కూడా.. ఇది సమాజం మొత్తం సాధించిన విజయం. మా ప్రజలకు లభించిన అతిపెద్ద గుర్తింపు అని మరియా కొరీనా పేర్కొన్నారు.

Next Story