- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Marco rubio: చైనాపై అందుకే వెనక్కి తగ్గాం.. అమెరికా విదేశాంగ మంత్రిమార్కో రూబియో
చైనాపై సెకండరీ టారిఫ్‌లు విధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగేవని, అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియో తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: చైనాపై సెకండరీ టారిఫ్‌లు విధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగేవని, అందుకే అదనపు ఆంక్షలు విధించే విషయంలో వెనక్కి తగ్గామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco rubio) తెలిపారు. ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడారు. చైనాపై ఏవైనా అదనపు ఆంక్షలు విధిస్తే ఇంధన ధరలు పెరగడంతో పాటు మార్కెట్లకు అంతరాయం కలుగుతుందన్నారు. చైనా, భారత్‌లపై 100 శాతం సుంకాలను విధించేందుకు యోచిస్తున్న సమయంలో ఈ ప్రతిపాదనపై పలు యూరోపియన్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయని చెప్పారు. యూరప్ రష్యన్ చమురును కొనుగోలు చేస్తుందా అని అడిగిన ప్రశ్నకు రూబియో స్పందిస్తూ.. చైనాకు వెళ్లి శుద్ధి చేయబడుతున్న చమురుఎక్కువ భాగం తిరిగి యూరప్‌కే అమ్ముడవుతోందని తెలిపారు. యూరప్ ఇప్పటికీ సహజ వాయువును కూడా కొనుగోలు చేస్తోందని గుర్తు చేశారు. రష్యా చమురు కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తూ భారత్ పై అమెరికా 25 శాతం అదనపు సుంకం విధించిన విషయం తెలిసిందే. అయితే ఇదే టైంలో చైనాపై సుంకాలు విధించేందుకు మాత్రం గడువు పెంచారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రూబియో స్పందించి క్లారిటీ ఇచ్చారు.






