విరుచుకుపడిన మావోయిస్టులు.. పోలీసు వాహనం పేల్చివేత, ఏఎస్పీ దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-09 05:08:32  IST  )

‘ఆపరేషన్ కగార్’‌తో భద్రతా దళాలు మావోయిస్టుల ఏరివేతను ముమ్మరం చేస్తున్నాయి.

విరుచుకుపడిన మావోయిస్టులు.. పోలీసు వాహనం పేల్చివేత, ఏఎస్పీ దుర్మరణం
X

దిశ, వెబ్‌డె‌స్క్: ‘ఆపరేషన్ కగార్’‌ (Operation Kagar)తో భద్రతా దళాలు మావోయిస్టుల ఏరివేతను ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే నారాయణ‌పూర్ (Narayanapur), బీజాపూర్ (Bijapur), సుక్మా జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వారి ఉనికే ప్రశ్నార్థకమైందంటూ వార్తలు వస్తున్న తరుణంలో సుక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు ఊహించిన షాక్ ఇచ్చారు. ఏకంగా కూబింగ్ ఆపరేషన్ చేపడుతోన్న పోలీసు వాహనాన్ని పక్కాగా ఐఈడీతో బ్లాస్ట్ చేశారు. ఈ దుశ్చర్యలో ఏఎస్పీ ఆకాశ్ రావు (ASP Aakash Rao) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా డీఎస్పీ (DSP)తో పాటు మరో సీఐ (CI)కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన తోటి భద్రతా సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ బ్లాస్ట్‌కు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story