- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maoists: మధ్యప్రదేశ్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతం.. మాండ్యా జిల్లాలో ఎన్‌కౌంటర్
మధ్యప్రదేశ్‌లోని మాండ్యా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతమయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ (MadhyaPradesh)లోని మాండ్యా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతమయ్యారు. బిచియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సారాయ్ అడవుల్లో నక్సలైట్లు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగగా ఇద్దరు మహిళా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసు ఉన్నతాధికారి కైలాష్ మక్వానా తెలిపారు. వారిద్దరినీ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మమత, ప్రమీలగా గుర్తించారు. ఇద్దరిపైనా చెరో రూ.14 లక్షల రివార్డు ఉంది. ఘటనా ప్రాంతంలో భారీగా ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరింత మంది నక్సలైట్లు ఉన్నారనే సమాచారం మేరకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అంతకుముందు ఫిబ్రవరి 19న బాలఘాట్‌లోని గాధి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మహిళా నక్సలైట్లు మరణించారు.
తాజా ఎన్ కౌంటర్‌పై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ (Mohan Yadav) స్పందించారు. ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా దళాలకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith shah) నాయకత్వంలో మార్చి 2026 నాటికి దేశాన్ని నక్సల్ సమస్య నుంచి పూర్తిగా విముక్తి చేయాలనే సంకల్పానికి ఈ విజయం ఖచ్చితంగా ఊతం ఇస్తుందని తెలిపారు. మావోయిస్టుల సమస్య నుంచి రాష్ట్రం పూర్తిగా విముక్తి పొందుతుందని పేర్కొన్నారు.






