రాబోయే 15గంటల్లోపు మావోయిస్టుల మెగా సరెండర్!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-16 08:17:59  IST  )

రాబోయే 15గంటల్లో పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోనున్నానరని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కీలక ప్రకటన చేశారు. వారిని జనజీవన స్రవంతిలోకి స్వాగతిస్తున్నామని తెలిపారు. మావోయిస్టు నేత సోను ఇప్పటికే లొంగిపోయారని ముఖ్యనేతలు కూడా లొంగిపోతారని చెప్పారు.

రాబోయే 15గంటల్లోపు మావోయిస్టుల మెగా సరెండర్!
X

దిశ, వెబ్ డెస్క్: రాబోయే 15గంటల్లో పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోనున్నానరని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కీలక ప్రకటన చేశారు. వారిని జనజీవన స్రవంతిలోకి స్వాగతిస్తున్నామని తెలిపారు. మావోయిస్టు నేత సోను ఇప్పటికే లొంగిపోయారని ముఖ్యనేతలు కూడా లొంగిపోతారని చెప్పారు. కాకర్స్ ప్రాంతం, మాడ్ ప్రాంతం ఇప్పడు పూర్తిగా విముక్తి పొందిందని అన్నారు. దక్షిణ బస్తర్‌లో ఓ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని ప్రభుత్వం విజ్ఞ‌ప్తి చేస్తుంద‌ని చెప్పారు. మీరు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా పోరాడాల‌ని హిత‌వుప‌లికారు.

మావోయిస్టుల లొంగుబాటు కార్య‌క్ర‌మం బ‌స్త‌ర్‌లోని జ‌గ్దల్ పూర్‌లో జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా వస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మావోయిస్టు ప్రభావిత జిల్లాలు నారాయణ్‌పూర్, సుక్మా, బీజాపూర్ మాత్రమే అని అన్నారు. వీటిలోనూ నారాయణ్‌పూర్‌లో మావోయిస్టుల ప్రభావం చాలా వరకు తగ్గిపోయిందని, సుక్మా జిల్లాల్లో కూడా కాస్త తగ్గిందన్నారు. బీజాపూర్ జిల్లాల్లో కూడా ప్రభావం తగ్గుతుందని తాను భావిస్తున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉంటే బుధ‌వారం మ‌హ‌రాష్ట్ర‌లోని గ‌డ్చిరోలిలో పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ సహా 61మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే దాదాపు 50 మందితో కూడిన మరో టీం లొంగిపోయేందుకు బస్తర్ అడవుల నుండి కాకేర్ జిల్లా కోయల్ బేడా సమీపంలోని కామ్ తోరా బీఎస్ఎఫ్ క్యాంపుకు చేరుకున్నట్టు సమాచారం. వీరిలో తెలంగాణకు చెందిన సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, సీసీ సభ్యుడు ఆశన్న సహా మరో 130 మంది మావోయిస్టులు అబూజ్ మాడ్ నుంచి బీజాపూర్ జిల్లా బైరామ్ గఢ్ పోలీస్ క్యాంపు చేరుకున్నట్లు సమాచారం అందింది.

Next Story