- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్‌ఫార్మర్లకు మావోయిస్టుల మాస్ వార్నింగ్.. సంచలన లేఖ విడుదల
భద్రతా బలగాలకు మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నారనే నెపంతో ఇటీవలే ముగ్గురు గిరిజనులను మావోయిస్టులు హతమార్చిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: భద్రతా బలగాలకు మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నారనే నెపంతో ఇటీవలే ముగ్గురు గిరిజనులను మావోయిస్టులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ హత్యలపై తాజాగా భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) గంగలూర్ ఏరియా కమిటీ సంచలన లేఖను విడుదల చేసింది. పెద్ద కోర్మ గ్రామంలోని ఇన్ఫార్మర్, మావోయిస్టు పార్టీ ద్రోహి దినేష్ కుటుంబాన్ని గతంలో జన అదాలత్‌లో ప్రవేశపెట్టి నాలుగైదు సార్లు హెచ్చరించామని లేఖలో వెల్లడించారు. అయినా, వారు తీరు మార్చుకోలేదని, దళ సభ్యుల వివరాలను ఎప్పటికప్పుడు భద్రతా దళాలు, పోలీసులకు చేరవేశారని ఆరోపించారు.
ఎవరికైనా ఇదే శిక్ష..
బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్.. ఇన్ఫార్మర్ దినేష్ సూచనల మేరకు కొంతమంది విద్యార్థులు, పిల్లలను రహస్య సైనికులుగా, టీమ్స్‌గా తయారు చేసి సమాచారం అందించేందుకు బీజాపూర్ జిల్లా పరిధిలోని చాలా గ్రామంలో మోహరించారని తెలిపారు. తాము వారిని ముందుగానే గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ తర్వాత జనఅదాలత్‌లో ప్రవేశపెట్టి మోడియం జుంగు, మోడియం సోమల్, మాడవి అనిల్‌లను హతమార్చామని స్పష్టం చేశారు. తమ PLGA (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)పై ఆ ద్రోహులు ఎన్నోసార్లు దాడులు చేయడానికి పోలీసులకు సమాచారం అందించారని ఫైర్ అయ్యారు. అందుకే వారిని అదుపులోకి తీసుకుని చంపేశామని అన్నారు. ఆ హత్యలకు ప్రభుత్వం, పోలీసు అధికారి జితేంద్ర యాదవ్, ఇన్ఫార్మర్లు దినేష్, నీష్, సంతోష్‌లే బాధ్యులని తెలిపారు. భవిష్యత్తులో ఇలా ఇన్‌ఫార్మర్‌గా మారిన ఎవరికైనా.. ఇదే శిక్ష విధించబడుతుందని ఇస్తూ లేఖలో స్పష్టం చేశారు.
హిందుత్వ ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుదాం
ఇన్‌ఫార్మర్‌గా మారిన మోడియం జుంగుకు రూ.25 వేలు పోలీసుల నుంచి ముట్టాయని, మరో 25 వేలు ఎస్పీ జితేంద్ర యాదవ్ నుంచి రావాల్సి ఉందన్నారు. కొంత డబ్బును బ్యాంకులో దాచేందుకు దినేష్, జుంగుతో ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. మోడియం సోమల్‌కు 2 నెలల శిక్షణనిచ్చి రూ.10 వేలు ఇచ్చి ఇన్ఫార్మర్ గ్రూప్‌లో చేర్చుకున్నారని ఆరోపించారు. మాడవి అనిల్ కూడా ఆ బృందంలో సభ్యుడని.. అందులో మొత్తం 10 మంది ఉన్నారని పేర్కాన్నారు. వారందరిని అదుపులోకి తీసుకుని జనఅదాలత్‌లో హెచ్చరించి విడుదల చేశామని పేర్కొన్నారు. ఇక నుంచి అయినా.. ఇలాంటి రహస్య ఇంటెలిజెన్స్ సైనికులుగా లేదా ప్రజా వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనవద్దంటూ లేఖలో గిరిజనులకు విజ్ఞప్తి చేశారు. ఫ్యూడలిజం, దళారీ బ్యూరోక్రసీ, కార్పొరేట్ సామ్రాజ్యవాదం అందరి హక్కులను లాక్కుంటున్నాయని, దేశ సంపదను కొల్లగొడుతోన్న హిందుత్వ ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుదామని.. జనయుద్ధం ద్వారా ‘ఆపరేషన్ కాగర్’ను ఓడిద్దామని అన్నారు.






