Chhattisgarh : ఇన్ఫార్మార్ల అనుమానంతో ముగ్గురిని హత్య చేసిన మావోయిస్టులు

by Muthe.Rajitha |

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని బీజాపూర్(Bijapur) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

Chhattisgarh : ఇన్ఫార్మార్ల అనుమానంతో ముగ్గురిని హత్య చేసిన మావోయిస్టులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని బీజాపూర్(Bijapur) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇన్ఫార్మర్ల(Informers)నే అనుమానంతో మావోయిస్టులు(Maoists) ముగ్గురిని హత్య చేశారు. బీజాపూర్లోని పెద్దకోర్మ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మాజీ సభ్యుడు దినేష్ మొడియం కుటుంబానికి చెందిన ముగ్గురిని.. మావోయిస్టుల కీలక సమాచారం పోలీసులకు అందజేశారనే అనుమానంతో నరికి చంపారు.

మొత్తం గ్రామంలో ఏడుగురిపై దాడి చేయగా.. వారిలో ముగ్గురు మరణించారు. మృతులు జింగు మొడియం, సోమ మొడియం, అనిల్ మద్వి గా సమాచారం. అలాగే గ్రామానికి చెందిన మరో 12 మందిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్టు బీజాపూర్ ఏఎస్పీ చంద్ర కాంత్ గవర్న పేర్కొన్నారు.

Next Story