- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maoists: నలుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్.. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఘటన
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు మహిళలు సహా నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ (Balaghat) జిల్లాలో శనివారం జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు మహిళలు సహా నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. జిల్లాలోని బైహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాగుర్ గ్రామానికి సమీపంలోని పచామా దాదర్ అడవుల్లో నక్సలైట్లు ఉన్నారనే సమాచారం మేరకు సీఆర్ పీఎఫ్, రాష్ట్ర పోలీసుల స్పెషల్ ఫోర్స్ పోలీసులు శనివారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరగగా నలుగురు నక్సలైట్ల మరణించారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో మావోయిస్టుల మృత దేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ సమయంలో మరి కొంతమంది నక్సలైట్లు గాయపడినట్టు సమాచారం. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు మధ్యప్రదేశ్ పోలీస్ స్పెషల్ డీజీ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఘటనపై సీఎం మోహన్ యాదవ్ (Mohan Yadav) స్పందించారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసులకు అభినందనలు తెలిపారు.






