- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maoists: నలుగురు మహిళా మావోయిస్టుల మృతి.. మధ్యప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు.

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని బాలాఘాట్ (Balaghat) జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. సూప్‌ఖర్ అటవీ ప్రాంతంలోని రౌండా ఫారెస్ట్ క్యాంప్ సమీపంలో మావోయిస్టులు ఉన్నారని ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో హాక్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (Cobra), జిల్లా పోలీసు బలగాలకు చెందిన 12కి పైగా బృందాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరగగా నలుగురు మహిళా నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయినట్టు ఏఎస్పీ విజయ్ దాబర్ తెలిపారు.
ఘటనా స్థలంలో మృత దేహాలతో పాటు ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్ గన్, 303 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో మరికొంత మంది మావోయిస్టులు సైతం గాయపడ్డట్టు తెలుస్తోంది. అయితే మహిళా మావోయిస్టులు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ స్పందించారు. ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో నక్సలిజం, హింసాత్మక కార్యకలాపాలకు చోటు లేదని తెలిపారు.






