- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ (Gariyabandh) జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్-ఒడిశా (chathisgarh-odisha) సరిహద్దులోని కుల్హాదీ ఘాట్ అడవుల్లో నక్సలైట్లు ఉన్నారన్న ఇంటలిజెన్స్ సమాచారం మేరకు ఛత్తీస్‌గఢ్ జిల్లా రిజర్వ్ గార్డులు, సీఆర్‌పీఎఫ్ (crpf) బలగాలు, కోబ్రా బెటాలియన్, ఒడిశా స్పెషల్ ఆపరేషన్ కమాండ్ గ్రూపునకు చెందిన బలగాలు సోమవారం ఆపరేషన్ ప్రారంభించాయి. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే ఇద్దరు మహిళా నక్సలైట్లు మరణించారు. ఓ కోబ్రా కమాండర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి మూడు ఐఈడీలు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన జవాన్‌ను చికిత్స నిమిత్తం విమానంలో రాయ్ పూర్‌కు తరలించినట్టు గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా తెలిపారు. ఇద్దరు మావోయిస్టుల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు మృతి చెందిన నక్సలైట్ల సంఖ్య 28కి చేరింది.






