Maoists: ఛత్తీస్‌గఢ్‌లో 18 మంది మావోయిస్టుల సరెండర్

by B.Srinivas |

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఛత్తీస్ గఢ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో 18 మంది మావోయిస్టుల సరెండర్
X

దిశ, నేషనల్ బ్యూరో: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ (Operation kagar) కొనసాగుతున్న నేపథ్యంలో ఛత్తీస్ గఢ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో 18 మంది మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), రాష్ట్ర పోలీసు సిబ్బంది సమక్షంలో వీరంతా సరెండర్ అయినట్టు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ (Kiran chawan) తెలిపారు. వారిలో 10 మంది వ్యక్తులపై రూ.38 లక్షల రివార్డు ఉన్నట్టు తెలిపారు. లొంగిపోయిన వారిలో టాప్ కమాండర్స్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)కి చెందిన మడ్కం ఆయతా, భాస్కర్ అలియాస్ భోగం లఖాలు ఉండగా ఒక్కొక్కరికి రూ.8 లక్షల బహుమతిని ప్రకటించారు. అలాగే ప్రతి మావోయిస్టుకు ప్రభుత్వం రూ.50,000 నగదు సహాయాన్ని ప్రకటించింది. అంతేగాక వారు సమాజంలోకి సజావుగా తిరిగి రావడానికి దోహదపడే ఇతర సహాయం సైతం చేస్తామని తెలిపింది.

Next Story