- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING : నంబాల కేశవరావు ఎన్కౌంటర్‌పై మావోయిస్టుల లేఖ విడుదల
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ (Nambala Kesavarao Encounter) పై మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ (Maoist Special Zonal Committee)పేరుతో మావోయిస్టులు లేఖ (Maoist's Letter) విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ (Nambala Kesavarao Encounter) పై మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ (Maoist Special Zonal Committee)పేరుతో మావోయిస్టులు లేఖ (Maoist's Letter) విడుదల చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందని లేఖలో వాపోయారు. కేశవరావు 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసన్నారు. కేశవరావు టీమ్ లో ఉన్న ఆరుగురు మావోయిస్టులు ఇటీవల పోలీసులకు లొంగిపోయారని, వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనిఫైడ్ కమాండో సభ్యుడొకరు సైతం ద్రోహిగా మారాడని లేఖలో పేర్కొన్నారు.
ఎన్కౌంటర్ ముందురోజు నుంచి 20 వేలమంది బలగాలు తామున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి.. 10 గంటల్లో ఐదు ఎన్కౌంటర్లు చేశాయని మావోయిస్టులు లేఖలో తెలిపారు. 60 గంటలపాటు బలగాలు తమను నిర్బంధించాయన్నారు. అప్పటికే కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించగా.. తమను వదిలి వెళ్లేందుకు ఆయన ఇష్టపడలేదన్నారు. నాయకత్వాన్ని ముందుండి నడిపించాలని తమతోనే ఉన్న కేశవరావుకోసం 35 మంది ప్రాణాలు అడ్డుపెడితే.. ఏడుగురం సురక్షితంగా బయటపడ్డామని, మిగిలిన వారంతా ఎన్కౌంటర్లో మరణించారని తెలిపారు. ఇప్పటికే తాము కాల్పుల విరమణ ప్రకటించినట్లు చెప్పారు. దేశ సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ (India - Pak Ceasefire) జరిపిన కేంద్రం.. తమతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేకపోవడం గమనార్హమన్నారు. ఈ విషయంపై కేంద్రం పునరాలోచించాలని మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.






