- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Encounter: ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. రూ. కోటి రివార్డు ఉన్న కీలక నేత మృతి
ఛత్తీస్‌గఢ్-ఒడిశా (Chhattisgarh-Odisha) సరిహద్దుల్లోని గరియాబంద్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 16 మంది చనిపోయారు. సోమవారం ఇద్దరు చనిపోగా.. మంగళవారం మరో 14 మంది చనిపోయారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్-ఒడిశా (Chhattisgarh-Odisha) సరిహద్దుల్లోని గరియాబంద్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 16 మంది చనిపోయారు. సోమవారం ఇద్దరు చనిపోగా.. మంగళవారం మరో 14 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు జైరాం అలియాస్ చలపతి కూడా ఉన్నాడు. ఆయనపై ప్రభుత్వం గతంలో రూ. కోటి రివార్డు ప్రకటించింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దుల్లో జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కోబ్రా, ఒడిశాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) భద్రతా సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. సోమవారం రాత్రి నుంచి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికి సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ లో వెయ్యి మంది వరకు భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది.
అమిత్ షా ఏమన్నారంటే?
మార్చి 2026 నాటికి మావోయిస్టుల ఉనికే లేకుండా చేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈ ఎన్ కౌంటర్ ను నక్సలిజం రూపుమాపేందుకు మరో బలమైన అడుగు అని అభివర్ణించారు. "నక్సలిజం లేని భారత్‌ను నిర్మించడంలో మన భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి. సీఆర్‌పీఎఫ్, ఎస్ఓజీ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు.. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సంయుక్త ఆపరేషన్‌లో 14 మంది నక్సలైట్లను మట్టుబెట్టారు" అని ఆయన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. నక్సలిజం లేని భారతదేశం కోసం భద్రతాదళాల తొలి అడుగు అని అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి కూడా భద్రతా దళాలను ప్రశంసించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కింద మార్చి 2026 నాటికి ఛత్తీస్ గఢ్ మావోయిస్టుల నుంచి విముక్తి పొందుతుందని ఆశాభావం వయక్తం చేశారు. "సైనికుల ఈ విజయం ప్రశంసనీయం. వారి ధైర్యసాహసాలకు నేను సెల్యూట్ చేస్తున్నాను" అని ఛత్తీస్ గఢ్ సీఎం సోషల్ మీడియాలో పోస్టు చేసుకొచ్చారు.
2024 నుంచి ఇప్పటివరకు..
ఈ ఏడాది ఛత్తీస్ గఢ్ లో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో ఇప్పటివరకు సుమారు 40 మంది మావోయిస్టులు మరణించారు. 2024లో ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాల చేతిలో 200 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. గతేడాది 219 మంది మావోలు చనిపోగా.. బస్తర్, దంతేవాడ, కాంకేర్, బీజాపూర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా జిల్లాల్లోని వారే 217 మందిగా ఉన్నారు. అంతేకాకుండా గతేడాది 800 మందికి పైగా మావోయిస్టులను కూడా అరెస్టు చేయగా, దాదాపు 802 మంది లొంగిపోయారు. 2024లో మావోయిస్టులతో జరిగిన పోరాటంలో దాదాపు 18 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మావోయిస్టు హింసలో మరణించిన పౌరుల సంఖ్య 65గా ఉంది.






