- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chhattisgarh : మావోయిస్టుల ఘాతుకం.. ఇన్ఫార్మార్ల నెపంతో నలుగురి కాల్చివేత
మావోయిస్టులు(Maoists) మరో ఘాతుకానికి పాల్పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : మావోయిస్టులు(Maoists) మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్(Chattisgarh) లోని బీజాపూర్ లో ఇన్ఫార్మార్ల(Informers)నే అనుమానంతో నలుగురిని కాల్చివేశారు. మృతులు లింగాల, కంచాల, మినగట్టు వాసులుగా సమాచారం. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్(Operation Kagar) లో భారీ సంఖ్యలో మావోయిస్టులు భద్రతా బలగాల చేతుల్లో ఎన్కౌంటర్ చేయబడ్డారు. అయితే పోలీసులకు మావోల కీలక సమాచారాన్ని అందజేశారనే నెపంతోనే ఈ నలుగురిని హత్య చేసినట్టు సమాచారం. ఇటీవల కర్రెగుట్టల్లో మావోలు తలదాచుకున్న సమాచారం కూడా వీరే భద్రతా బలగాలకు అందజేశారని నక్సల్స్ అనుమానించినట్టుగా తెలుస్తోంది.
కర్రెగుట్టల ఘటనలో తాము కాల్పులు విరమిస్తున్నట్టు మావోయిస్టులు ప్రకటించారు. అంతలోనే ఇన్ఫార్మర్స్ అనే అనుమానంతో నలుగురిని చంపడం సంచలనం రేకెత్తిస్తోంది. మరోవైపు భారత్-పాక్ యుద్ధం(India-Pakistan War) నేపథ్యంలో ఆపరేషన్ కగార్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మావోల ఈ చర్యతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.






