యమునా నది ఒడ్డున మన్మోహన్ సింగ్ మెమోరియల్‌

by Johnkora |
యమునా నది ఒడ్డున మన్మోహన్ సింగ్ మెమోరియల్‌
X

- మాజీ ప్రధాని కుటుంబానికి తెలియజేసిన కేంద్రం

దిశ, నేషనల్ బ్యూరో:

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మృత్యార్థం నిర్మించనున్న 'మన్మోహన్ సింగ్ మెమోరియల్'‌కు కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. యమునా నది ఒడ్డున ఉన్న రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో మన్మోహన్ మెమోరియల్‌ కోసం స్థలాన్ని ఇవ్వనున్నట్లు ఆయన కుటుంబానికి తెలియజేసింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోసం గత నెలలో కేటాయించిన స్థలం పక్కనే.. మన్మోహన్ సింగ్ మెమోరియల్ కోసం స్థలం కేటాయించారు. అయితే మాజీ ప్రధాని కుటుంబీకులు ఇంకా ఈ స్థలంపై తమ నిర్ణయాన్ని వెల్లడించలేదు. నిబంధనల ప్రకారం మన్మోహన్ కుటుంబీకులు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తే.. దానికి ఈ స్థలాన్ని అప్పగిస్తారు. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సెక్రటరీ కే.శ్రీనివాసన్ ఇటీవల మన్మోహన్ కుటుంబాన్ని కలిసి.. కేంద్రం ప్రతిపాదించిన 1.5 ఎకరాల స్థలం గురించి వివరించారు. కాగా, మన్మోహన్ సింగ్ కోసం కేటాయించాలనుకున్న స్థలంలో ఆయన అంత్యక్రియలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని, ఇది ఆయనను అగౌరవ పరిచినట్లే అని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. అయితే ట్రస్ట్ ఏర్పడిన తర్వాత సదరు స్థలాన్ని మన్మోహన్ మెమోరియల్ కోసం అందిస్తామని, నిగమ్ బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించమని తాము కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు ముందే చెప్పామని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది.

Advertisement

Next Story