- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Manjhi: 20 సీట్లు ఇవ్వకపోతే 100 స్థానాల్లో పోటీ.. ఎన్డీఏకు హెచ్ఏఎం అల్టిమేటం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న హిందుస్తానీ అవామ్ మోర్చా చీఫ్ మాంఝీ కీలక ప్రకటన చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) కీలక ప్రకటన చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హెచ్ఏఎంకు 15 నుంచి 20 సీట్లు కేటాయించకపోతే 100 సీట్లలో స్వతంత్రంగా పోటీ చేస్తామని తెలిపారు. బుద్ధగయలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నుంచి గుర్తింపు పొందడమే తన పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ‘హెచ్ఏఎం గుర్తింపు పొందాలంటే మేము ఖచ్చితంగా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం. ఈసీ గుర్తింపు పొందాలంటే ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవాలి. ఓట్ల వాటా, మొత్తం ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే 20 సీట్లు కావాలి. ఎందుకంటే పోటీ చేసిన అన్ని సీట్లలో గెలవలేము’ అని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో మా కార్యకర్తలకు మంచి పట్టుంది, హెచ్ఏఎంకు ప్రతిచోటా 15 వేల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. అంతకుముందు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఎన్నికలకు ముందు ఇండియా, ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకంపై హీట్ పెరిగింది.






