- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manish: దేశ ఆత్మను కాపాడేందుకే ఇండియా కూటమి ఏర్పాటు.. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రమే గాక దేశ ఆత్మను కాపాడేందుకే ‘ఇండియా’ ఏర్పడిందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: కేవలం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రమే గాక దేశ ఆత్మను కాపాడేందుకే ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’ (India alliance) ఏర్పడిందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ (Manish Tiwari) నొక్కి చెప్పారు. శనివారం ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. దేశ లోక్ సభ ఎన్నికల్లో కూటమి మంచి పనితీరును కనబర్చిందని కొనియాడారు. దీని కారణంగానే బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించలేకపోయిందని చెప్పారు. కాషాయ పార్టీ నియంతృత్వానికి కాస్త అడ్డుకట్టపడిందని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను కూటమి నాయకులందరూ కలిసి నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే కూటమి ఏర్పడలేదని, దేశ ఆత్మను కాపాడేందుకే దీనిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఐడియా ఆఫ్ ఇండియాకు అనుగుణంగా పని చేస్తామని తెలిపారు. కాగా, లోక్‌సభ ఎన్నికల అనంతరం ఇండియా కూటమిలో ఐక్యత లోపించిందని, దీనిని కాంగ్రెసే కారణమని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ ఆందోళన వ్యక్తం చేసిన మరుసటి రోజే మనీష్ తివారీ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.






