- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Manipur: మణిపూర్‌లో నేషనల్ హైవే-2 ప్రారంభం.. మోడీ పర్యటన వేళ కీలక పరిణామం
ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ పర్యటన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) మణిపూర్ పర్యటన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని నేషనల్ హైవే-2 (National high way-2) ని తిరిగి ఓపెన్ చేయడానికి కుకీ-జో గ్రూపులు అంగీకరించాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో మణిపూర్ ప్రభుత్వం, కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ (KNO), హోం మంత్రిత్వ శాఖ మధ్య వరుస సమావేశాలు జరిగాయి. ఈ క్రమంలోనే రహదారిని తెరిచేందుకు ఒప్పందం జరిగినట్టు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. త్రైపాక్షిక సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అగ్రిమెంట్ పై కుకీ జో కౌన్సిల్ సంతకం చేయగా ఇది ఏడాది పాటు అమలులో ఉంటుంది. ఈ జాతీయ రహదారిపై భద్రతా దళాలతో సహకరించి శాంతిని కాపాడటాకినికి కృషి చేస్తామని కుకీ కౌన్సి్ల్ తెలిపింది.
కాగా, నేషనల్ హైవే 2 ఈశాన్య ప్రాంతానికి ఎంతో కీలకంగా ఉంది. ఈ హైవే మణిపూర్, నాగాలాండ్, మిజోరాం మధ్య దేశంలోని మిగిలిన ప్రాంతాలను అనుసంధానిస్తుంది. మణిపూర్‌లోని ఆహార పదార్థాలు, మందులు, ఇంధనం, నిత్యావసరాలు ఈ హైవే ద్వారానే సరఫరా అవుతాయి. అయితే 2023లో కుకీ, మెయితీ తెగల మధ్య అల్లర్ల అనంతరం దీనిని క్లోజ్ చేశారు. ప్రస్తుతం దీనిని ఓపెన్ చేయడంతో మణిపూర్ ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.






