Manipur: తోటి సైనికులపైనే సీఆర్‌పీఎఫ్ జవాన్ కాల్పులు.. ఇద్దరు మృతి

by B.Srinivas |

మణిపూర్‌లో ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్ ఘాతుకానికి పాల్పడ్డాడు. తను విధులు నిర్వహిస్తున్న క్యాంపుపైనే కాల్పులు జరిపాడు.

Manipur: తోటి సైనికులపైనే సీఆర్‌పీఎఫ్ జవాన్ కాల్పులు.. ఇద్దరు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో ఓ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్ ఘాతుకానికి పాల్పడ్డాడు. తను విధులు నిర్వహిస్తున్న క్యాంపుపైనే కాల్పులు జరిపాడు. అనంతరం తనకు తాను కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంఫాల్ (Imphal) పశ్చిమ జిల్లాలోని లాంఫెల్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్ క్యాంపులో రాత్రి 8:20 గంటలకు ఈ ఘటన జరిగినట్టు మణిపూర్ పోలీసులు తెలిపారు. ఘాతుకానికి పాల్పడిన సైనికుడిని సంజయ్ కుమార్‌గా గుర్తించారు. ఒక కానిస్టేబుల్, ఎస్సై, నిందితుడు అక్కడికక్కడే మరణించినట్టు తెలిపారు. సర్వీస్ రివాల్వర్ తోనే కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. అయితే ఘటనకు గల కారణాలను వెల్లడించలేదు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. సీఆర్‌పీఎఫ్ సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story