- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మణిపూర్ సీఎం రాజీనామా.. కాంగ్రెస్ అగ్రనేత సంచలన వ్యాఖ్యలు
మణిపూర్ సీఎం (Manipur) బీరెన్ సింగ్ (Biren Singh) రాజీనామా (Resign) చేసిన సందర్భంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (AICC Leader rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మణిపూర్ సీఎం (Manipur) బీరెన్ సింగ్ (Biren Singh) రాజీనామా (Resign) చేసిన సందర్భంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (AICC Leader rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. ఈ సందర్భంగా మణిపూర్ పాలన (Manipur Governance) పై స్పందిస్తూ.. ఆసక్తికర ట్వీట్ (Intresting Tweet) చేశారు. ఈ ట్వీట్ లో బీరేన్ సింగ్ రాజీనామా (Biren Singh Resignation)కు సంబంధించిన కారణాలను వెల్లడించారు. అంతేగాక మోడీ(Modi) మణిపూర్ లో పర్యటించాలని డిమాండ్ (Demand) చేశారు. దీనిపై ఆయన.. దాదాపు రెండేళ్లుగా బీజేపీ (BJP)కి చెందిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మణిపూర్ లో విభజనకు పాల్పడుతున్నారని అన్నారు.
అలాగే ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) మణిపూర్‌లో హింస (violence), ప్రాణనష్టం (loss of life), భారతదేశం ఆలోచనా (ideology of India) విధ్వంసం (destruction) జరిగినప్పటికీ కూడా సీఎం (CM)ను కొనసాగించడానికి అనుమతించారని ఆరోపించారు. అంతేగాక సీఎం బీరేన్ సింగ్ రాజీనామాకు ప్రజల ఒత్తిడి పెరగడం (public pressure), సుప్రీంకోర్టు విచారణ (Supreme Court inquiry), కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం (Congress no-confidence motion) సహా పలు కారణాలు చూపిస్తున్నాయని తెలిపారు. ఇక రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడం, మణిపూర్ ప్రజల గాయాలను మాన్పడానికి కృషి చేయడం అత్యంత తక్షణ ప్రాధాన్యతగా చూడాలన్నారు.
ప్రధాని మోదీ మణిపూర్‌లో ఒకసారి పర్యటించి, ప్రజల మాటలను విని, సాధారణ స్థితికి తీసుకురావడానికి తగిన ప్రణాళికను వారికి వివరించాలని రాహుల్ గాంధీ కోరారు. కాగా మణిపూర్ లో గత కొంత కాలంగా అల్లర్లు కొనసాగుతున్నాయి. జాతుల మధ్య వైరం అల్లర్లను సృష్టించింది. మణిపూర్ ప్రభుత్వం ఈ అల్లర్లను నిలువరించలేక పోయింది. దీంతో ప్రభుత్వంపై, సీఎం బీరెన్ సింగ్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మణిపూర్ సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది.






