రాజీనామా అనంతరం కేంద్రానికి మణిపూర్ CM కీలక విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

రాజీనామా అనంతరం కేంద్ర ప్రభుత్వానికి మణిపూర్ సీఎం బీరెన్ సింగ్(Manipur CM Biren Singh) కీలక విజ్ఙప్తి చేశారు. ముందుగా మణిపూర్‌(Manipur)కు సహకరించిన కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు.

రాజీనామా అనంతరం కేంద్రానికి మణిపూర్ CM కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: రాజీనామా అనంతరం కేంద్ర ప్రభుత్వానికి మణిపూర్ సీఎం బీరెన్ సింగ్(Manipur CM Biren Singh) కీలక విజ్ఙప్తి చేశారు. ముందుగా మణిపూర్‌(Manipur)కు సహకరించిన కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు. క్లిష్ట సమయంలోనూ మణిపూర్‌లో కేంద్రం అభివృద్ధి పనులు చేపట్టింది. ఇకపైనా కూడా అభివృద్ధి పనులు కొనసాగించాలని రిక్వెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఆదివారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన బీరెన్‌ సింగ్‌ బీజేపీ అధ్యక్షుడు నడ్డా(JP Nadda), కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah)లతో సమావేశం అయ్యారు. అనంతరం మణిపుర్‌ వెళ్లి.. నేరుగా గవర్నర్‌ అజయ్‌ కుమార్‌ భల్లాను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. జాతుల మధ్య వైరంతో కొంతకాలంగా మణిపుర్‌ (Manipur News) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాసానికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీరెన్‌ సింగ్‌ పదవి నుంచి వైదొలగడం గమనార్హం.

‘‘మణిపూర్‌లోని ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసం సకాలంలో చర్యలు తీసుకోవటంతో పాటుగా అవసరమైన సమయంలో జోక్యం చేసుకుంటూ.. అభివృద్ధి పనులు, వివిధ ప్రాజెక్టులు అమలు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మణిపూర్ నాగరికత, చరిత్ర గొప్పది, విభిన్నమైనది. మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవాలి. సరిహద్దు చొరబాట్లను అరికట్టడం సహా అక్రమ వలసదారులను పంపించే విధానాన్ని రూపొందించాలి. డ్రగ్స్, మాదకద్రవ్యాలు సహా నార్కో టెర్రరిజంపై పోరాటాన్ని కొనసాగించాలి’’ అని రాజీనామా లేఖలో బీరెన్ సింగ్ కోరారు.

Next Story