- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా
మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు..

దిశ, వెబ్ డెస్క్: మణిపూర్(Manipur)లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా(Chief Minister Biren Singh resigns) చేశారు. గత కొంతకాలంగా మణిపూర్‌లో అల్లర్ల చెలరేగుతున్న విషయం తెలిసిందే. అయితే అల్లర్ల విషయంలో బీరెన్ సింగ్ పని తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షాను ఆయన కలిశారు. తాజాగా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ పరిణామంతో మణిపూర్‌లో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. బీరెన్ సింగ్ రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తే తదుపరి సీఎం ఎవరు అనే చర్చ మొదలైంది.
కాగా మణిపూర్‌లో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సీఎం బీరెన్ సింగ్‌పై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీఎం బీరెన్ సింగ్ రాజీనామ చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి.
మరోవైపు ఏడాదిన్నరగా మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు సమస్యలు తలెత్తాయి. మెయితీలు, కుకీల మధ్య చెలరేగిన వైర్యం భారీ హింసకు దారితీసింది. దీంతో ప్రభుత్వం కార్యాలయాలపై దాడులు జరిగాయి. అల్లర్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ హింసను ప్రేరేపించింది ఎవరనే దానిపై ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పేరుతో ఆడియో క్లిప్పులు లీకయ్యాయి. అంతేకాదు ఈ ఆడియోలు వైరల్‌గా మారాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఆయుధాలను లూటీ చేసేందుకు మెయితీలకు అవకాశం ఇవ్వండంటూ ఆడియో క్లిప్పుల్లో ఉండటంతో సీఎం బీరెన్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం రాజీనామాకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
#BreakingNews#Manipur CM #NBirenSingh tenders resignation from the post of Chief Minister. pic.twitter.com/u3IV3j7wcv
— The Tribune (@thetribunechd) February 9, 2025






