మిస్ యూనివర్స్ పోటీ నుంచి భారత్ ఔట్

by Malleboina Mahesh |   (  Updated:2025-11-21 03:51:14  IST  )

థాయిలాండ్‌ వేదికగా జరుగుతున్న మిస్ యూనివర్స్ 2025 పోటీలో భారత ప్రతినిధి మనికా విశ్వకర్మ టాప్ రౌండ్లకు అర్హత పొందలేకపోయింది.

మిస్ యూనివర్స్ పోటీ నుంచి భారత్ ఔట్
X

దిశ, వెబ్ డెస్క్: థాయిలాండ్‌ వేదికగా జరుగుతున్న మిస్ యూనివర్స్ 2025 పోటీలో భారత ప్రతినిధి మనికా విశ్వకర్మ టాప్ రౌండ్లకు అర్హత పొందలేకపోయింది. మొదట టాప్ 30 లోకి అర్హత సాధించిన ఆమె తర్వాతి రౌండ్లలో టాప్ 12లో స్థానం దక్కకపోవడంతో ఆమె ప్రయాణం ఇక్కడితో ముగిసింది. భారతం తరఫున ఈ ఏడాది పోటీలో పాల్గొన్న మనికా రాజస్థాన్‌కు చెందిన విద్యార్థి కాగా, ప్రిలిమినరీ రౌండ్లలో మంచి ప్రదర్శనే చూపించినప్పటికీ తదుపరి రౌండ్‌కు ఎంపిక కాలేదు. ఇదే సమయంలో, మిస్ యూనివర్స్ పోటీ ఈ ఏడాది అనేక వివాదాలతో పాటు థాయిలాండ్ వేదికగా జరిగిన సాషింగ్ కార్యక్రమం సందర్భంగా జడ్జీలు, కాంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు, వాక్‌ఔట్లు చోటు చేసుకోవడం కూడా ఈ వేడుకపై ప్రశ్నలు రేకెత్తించింది. ఈ పోటీలో మొత్తం 100 దేశాలు పాల్గోనగా కీలక రౌండ్ అయిన టాప్ 12 లోకి చిలి, వెనిజులా, థాయిలాండ్, ఫలిప్పిన్స్, మాల్టా, చైనా, గ్వాడెలోప్, కోట్ డీ ఐవరీ దేశాల కంటెస్టెంట్లు అర్హత సాధించారు.

Next Story