- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mandsaur Accident : మాండ్సౌర్ రోడ్డు ప్రమాదం... 11 కు చేరిన మృతులు
మధ్యప్రదేశ్ లోని మాండ్సౌర్(Mandsaur Accident) జిల్లాలో ఆదివారం ఓ వ్యాన్ అదుపు తప్పి బావిలో పడిన సంఘటన తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ లోని మాండ్సౌర్(Mandsaur Accident) జిల్లాలో ఆదివారం ఓ వ్యాన్ అదుపు తప్పి బావిలో పడిన సంఘటన తెలిసిందే. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య 11 కు చేరింది. మధ్యప్రదేశ్(MP)లోని మండ్సౌర్ జిల్లాలో కచారియా గ్రామంలో నారాయణగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. 13 ప్రయాణికులతో వెళుతున్న ఓ మినీ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ తో ముందు ఓ బైక్ ను ఢీకొట్టి.. అనంతరం పక్కనే ఉన్న ఓ పాడిబడిన బావిలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది మృతి చెందినట్టు స్థానిక పోలీసులు తెలియజేశారు. మృతుల్లో బైక్ మీద వెళ్తున్న వ్యక్తి, కారులోని 9 మందితోపాటు.. సహాయక చర్యల కోసం వచ్చిన గ్రామస్థుడు కూడా మరణించడం అక్కడి వారిని కలచి వేసింది. దాదాపు 5 గంటలపాటు కష్టపడి బావిలోనుంచి వ్యాన్ ను బయటికి తీసాయి రెస్క్యూ బృందాలు.
తీవ్రంగా గాయపడిన మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. అయితే ఆ పాడుబడిన బావిలో విషవాయువులు ఉండటం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఘటనపై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీశ్ దేవ్డా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్ళిన ఆయన.. సహాయక చర్యలపై, క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు.






