- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
15 ఏళ్లుగా ఉద్యోగం లేదని విడాకులు తీసుకున్న భార్య.. రూ.2.28 వేల కోట్ల జాక్‌పాట్ కొట్టిన భర్త
పెళ్లైన నాటి నుంచి భర్తకు సరైన ఉద్యోగం లేదు. పోనీ ఏదైనా ఉద్యోగం, పని వెతుక్కుని చేసే ఓపిక కూడా అతనికి లేదు.

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లైన నాటి నుంచి భర్తకు సరైన ఉద్యోగం లేదు. పోనీ ఏదైనా ఉద్యోగం, పని వెతుక్కుని చేసే ఓపిక కూడా అతనికి లేదు. తన కనీస అవసరాలను కూడా తీర్చలేని వ్యక్తితో తాను ఉండలేనంటూ విడాకుల కోసం కోర్టుకెక్కిందో భార్య. 15 ఏళ్లుగా ఆమె పడుతున్న బాధల్ని విన్న కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఉద్యోగం లేని భర్త నుంచి భరణంగా ఎంతొస్తే అంత తీసుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాతే అతని లైఫ్ లో మ్యాజిక్ జరిగింది.
తంతే గారెల బుట్టలో పడ్డట్టుగా.. అతను కొన్న లాటరీ టికెట్ కు జాక్ పాట్ తగిలింది. న్యూజెర్సీలోని మైక్ వీరేన్కీకి లాటరీలో రూ.2.28 వేల కోట్లు వచ్చాయి. దీంతో అతని ఆనందానికి అవధుల్లేవు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు డబుల్ జాక్ పాట్ కొట్టావ్ బ్రో, రెండుసార్లు లాటరీ తగిలింది, నిన్ను వదిలివెళ్లిన నీ భార్య మళ్లీ నీ డబ్బును చూసి తిరిగివస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.






